'మళ్లీ మీరు రావాలి... సార్'

'మళ్లీ మీరు రావాలి... సార్'

ఢిల్లీలో సీఎం చంద్రబాబును ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కలవడం చర్చనీయాంశమైంది. ఎన్డీయేతర ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా మూడు రోజులుగా ఢిల్లీలో పలువురు విపక్షనేతలను కలుస్తూ చంద్రబాబు బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీనేత విష్ణుకుమార్ రాజు చంద్రబాబును కలిశారు. అయితే తాను సీఎంను మర్యాదపూర్వకంగానే కలిసేందుకు వచ్చాని తెలిపారు.  మీరు, మళ్లీ అధికారంలోకి రావాలని అభినందించానని అన్నారు. 

'ఇందులో తప్పేమీ లేదు. ఎవరు ఏమనుకున్నా, విమర్శలు చేసినా, నా మనసుకు నచ్చినట్లు ప్రవర్తిస్తాను. జాతీయ స్థాయిలో మోడీని వ్యతిరేకిస్తూ చంద్రబాబు తృతీయ కూటమి కోసం ప్రయత్నిస్తున్నా, నేను చంద్రబాబు ను కలవడాన్ని రాజకీయ కోణంలో చూడరాదు. ఐదేళ్ల పాటు అసెంబ్లీలో కలిసి పనిచేశాం. కాబట్టి చంద్రబాబు ను కలిశాను. నేను టీడీపీలో చేరుతున్నాన్న ప్రచారం సరైంది కాదు' అని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు.