'రాజ్‌భవన్‌లో పరేడ్‌ నిర్వహిస్తాం'

'రాజ్‌భవన్‌లో పరేడ్‌ నిర్వహిస్తాం'

కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ త్వరత్వరగా పావులు కదుపుతోంది.  కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, ధర్మేంద్రప్రదాన్, జేపీ నడ్డా పర్యవేక్షణలో ఇవాళ బీజేపీ శాసనసభా పక్ష సమావేశం బెంగళూరులో జరిగింది. శాసనసభా పక్ష నేతగా యడ్యూరప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశం అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు రాజభవన్‌కు బయలుదేరారు. ఎమ్మెల్యేలంతా యెడ్డీ ఆధ్వర్యంలో గవర్నర్‌ ముందు పరేడ్‌ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. బల నిరూపణకు రేపటి వరకు సమయం ఇవ్వాలని గవర్నర్‌ను యడ్యూరప్ప కోరనున్నట్టు తెలిసింది. మరోవైపు గురువారం ఉదయం 11.30కు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.