'నారా.. నందమూరిగా చీలనున్న టీడీపీ..!'

'నారా.. నందమూరిగా చీలనున్న టీడీపీ..!'

తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోనుందని జోస్యం చెప్పారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ మాధవ్... విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... టీడీపీ.. నారా పార్టీ, నందమూరిపార్టీగా విడిపోనుంది.. రెండుగా నిట్టనిలువునా చీలిక రానుందని వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో  సైకిల్‌లో గాలి లేదని తెలుస్తోందని.. ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి కామెంట్ చేసిన మాధవ్... రాష్ట్రంలో స్థానం ఉండదనే ఉనికి కోసమే చంద్రబాబు ఇతర రాష్ట్రాల నేతలను కలుస్తున్నారని సెటైర్లు వేశారు. ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీతో కుమ్మక్కైన చంద్రబాబు కొత్త డ్రామా ఆడారని ఆరోపించిన బీజేపీ ఎమ్మెల్సీ... మరోవైపు డేటా చోరీ గురించి విచారణ ముందుకు వెళ్లలేదన్నారు. ఏపీ మాజీ సీఎస్ పునేఠ తొలగింపుకు కారణం ఎవరో అందరికి తెలుసన్న మాధవ్.. మళ్లీ మీరే రావాలి అని విష్ణుకుమార్‌రాజు అనటం ఆయన వ్యక్తిగతమని అభిప్రాయపడ్డారు. ఇక ఏపీలో తప్ప అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.