నేను ముందే చెప్పా...!

నేను ముందే చెప్పా...!

చంద్రబాబుకు 30 సీట్ల కంటే ఎక్కువ రానివ్వమని తాను గతంలోనే చెప్పానన్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు... ఎన్నికల ఫలితాలు, టీడీపీ 23  సీట్లకే పరిమితం అవ్వడంపై రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఒరిజినాలిటీ లేని నాయకుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఏ రోజు ఏ పార్టీ వద్దకు వెళ్తాడో తెలియదని వ్యాఖ్యానించిన వీర్రాజు... చంద్రబాబుతో గతంలో పొత్తు కారణంగా ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ, జనసేనలు నష్టపోయాయన్నారు. సాక్షాత్తూ స్పీకర్ కోడెలను చొక్కా విప్పి కొట్టారంటే ప్రజల ఆగ్రహం తెలుసుకోవచ్చన్న బీజేపీ ఎమ్మెల్సీ... ప్రజలు నాలుగేళ్లు టీడీపీ ఆరచకాలను మౌనంగా చూస్తూ వచ్చారన్నారు. ఇక సంక్లిష్టమైన పరిస్థితుల్లో జగన్ విజయం సాధించారు.. ఈ ఎన్నికల్లో ఏపీలో మేం ఏం చెయ్యాలో అది చేశామన్నారు సోమువీర్రాజు. 1998లో ఏపీలో బీజేపీకి వచ్చిన 18 శాతం ఓట్లు ఇప్పుడు తెలంగాణలో వచ్చాయన్నారు వీర్రాజు... చంద్రబాబు ఇప్పటి వరకూ 1996 ఎన్నికల్లో మాత్రమే  ఒంటరిగా పోటీ చేసి గెలిచారన్న ఆయన... ఏపీ మీడియా సంస్థల్లో కొంతమంది ఇప్పటికైనా మారాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీది ఓ ప్రయాణం అన్నారు.