'అందుకే చంద్రబాబు డ్రామాలు..!'

'అందుకే చంద్రబాబు డ్రామాలు..!'

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. మరోవైపు చంద్రబాబు పచ్చి రాజకీయ వ్యభిచారి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సోము వీర్రాజు... పోలవరం ప్రాజెక్టుపై రివ్యూ చేసిన చంద్రబాబు నాయుడు... రైతుల గిట్టుబాటు ధరలపై ఎందుకు సమీక్ష నిర్వహించలేదని ప్రశ్నించారు. ఇక న్యాయ వ్యవస్థపై చంద్రబాబు ప్రభావం ఉందని ఆరోపించిన సోము వీర్రాజు... 17 కేసులపై స్టే తీసుకొని చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు.