సీబీఐకి ఫిర్యాదు చేస్తాం...

సీబీఐకి ఫిర్యాదు చేస్తాం...

ప్రధాని నరేంద్ర మోడీ లేకుండా ఏపీ సీఎం చంద్రబాబు జీరో అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు... తూర్పు గోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో జరుగుతున్న నీరుచెట్టు, హౌసింగ్‌లో అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఒక్క హౌసింగ్ లోనే రూ. 30 వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించిన ఆయన... మరో పది లక్షల ఇళ్లు మంజూరు చేస్తే లక్ష కోట్ల కుంభకోణం జరిగేదని విమర్శించారు. 

రాష్ట్రంలో నడుస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం కాదు... కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ గవర్నమెంట్ అంటూ సెటైర్లు వేశారు సోము వీర్రాజు... అన్నిపార్టీల నుంచి వచ్చిన వాళ్లతో టీడీపీ సర్కార్ నడుస్తోందని విమర్శించాన ఆయన... చంద్రబాబు పచ్చచొక్కా, మేకప్ వేసుకున్న కాంగ్రెస్ మనిషి అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ప్రజల సొమ్ము పప్పుబెల్లాలతో సమానం... పోలవరంతో ఆయనకు సంబంధం ఏంటి...? అని ప్రశ్నించారు సోము వీర్రాజు. ఈనెలలోనే మా పార్టీ అధ్యక్షుడితో కలిసి పోలవరాన్ని సందర్మిస్తామని... రాష్ట్రంలో మరో సంపూర్ణ విప్లవం రావాలని... లేదంటే చంద్రబాబుతో ప్రమాదమంటూ హెచ్చరించారు బీజేపీ ఎమ్మెల్సీ.