'చంద్రబాబు విధిరాతను బీజేపీయే రాసింది..!'

'చంద్రబాబు విధిరాతను బీజేపీయే రాసింది..!'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధిరాతను రాసింది భారతీయ జనతా పార్టీయే అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు... తిరుపతిలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన.. బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని.. బీజేపీకి నష్టం కలిగించాలని అన్ని ప్రయాత్నాలు చేశారని.. కానీ, ఇప్పుడు చంద్రబాబు ఎమీ చేయాలో అర్ధం కాక రోడ్డుమీదకు వచ్చాడు.. ఆ పరిస్ధితి తీసుకొచ్చింది బీజేపీయే అన్నారు. చంద్రబాబు ఎన్ని చేసిన బీజేపీయే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు సోము వీర్రాజు.