మోడీ హీరో... చంద్రబాబు జీరో...

మోడీ హీరో... చంద్రబాబు జీరో...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు... రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన... సమర్ధ పరిపాలనలో ప్రధాని నరేంద్ర మోడీ హీరో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు జీరో అంటూ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు పొట్ట విప్పితే  అన్ని అబద్దాలేనని మండిపడ్డ సోము వీర్రాజు... మోడీ జపం చేయనిదే చంద్రబాబుకు తెల్లవారటం లేదని సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన అవార్డులు మొత్తం కేంద్ర ప్రభుత్వ పథకాలకి వచ్చినవే అన్నారు.