కేంద్ర మంత్రి అనంతకుమార్‌కు క్యాన్సర్‌?

కేంద్ర మంత్రి అనంతకుమార్‌కు క్యాన్సర్‌?

కర్ణాటకకు చెందిన సీనియర్‌ బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి అనంత కుమార్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ అనే అనుమానంతో ఆయనకు పలు రకాల పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో చికిత్స పొందుతున్నారు. గత రెండు వారాల నుంచి ఆయనకు పలు పరీక్షలు నిర్వహించారని, అవసరమైతే మరింత మెరుగైన చికిత్స కోసం ఆయన అమెరికాకు వెళ్ళే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. మంత్రి ఆరోగ్యంపై కేంద్ర మంత్రులు, అధికారులు నోరు మెదపడం లేదు. అయితే గత కొన్ని వారాలుగా ఆయనకు ఆఫీసుకు రావడం లేదని తెలుస్తోంది. అనంత కుమార్ ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాలు, కెమికల్స్ అండ్‌ పర్టిలైజర్స్ శాఖలకు మంత్రిగా ఉన్నారు.