పోచారం కుటుంబం నుంచి బాన్సువాడకు త్వరలో విముక్తి..!

పోచారం కుటుంబం నుంచి బాన్సువాడకు త్వరలో విముక్తి..!

బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పోచారం గబ్బిలంలా పట్టి పీడిస్తున్నాడని.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. పోచారం ప్రజల పాలిట గ్రహచారంలా మారారని దుయ్యబట్టారు. పోచారం కుమారులు స్యాండ్, ల్యాండ్ మాఫియాతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.  పోచారం కుటుంబం నుంచి బాన్సువాడ ప్రజలకు త్వరలో విముక్తి కల్పిస్తామని ప్రకటించారు ఎంపీ అర్వింద్. మంజిరా నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని, ఇసుక మాఫియాను అడ్డుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో పోచారం ఓడిపోవడం ఖాయమని అర్వింద్ జోస్యం  చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఎయిర్ ఫోర్స్ ఉంటే ఎయిర్ ఫోర్స్ ను అమ్మేసేవాడని విమర్శించిన అర్వింద్,  టీఆర్ఎస్ స్టీరింగ్ ఉత్తమ్ నడుపుతున్నారని ఆరోపించారు.

మరోవైపు.. బాన్సువాడలో వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా చేపట్టిన బహిరంగ సభ సక్సెస్ అయ్యిందని ఆ పార్టీ నేతలు సంబరపడిపోతున్నారు... సభకు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలొచ్చారు. త్వరలో మరిన్ని చేరికలు ఉంచాయని ఆ పార్టీ నేతలు చెప్పారు. నియోజకవర్గాన్ని రెండు ముక్కలు చేసి బాన్సువాడకు పోచారం తీరని అన్యాయం చేశారని, ప్రజల ఆకాంక్ష నెరవేర్చే పార్టీ బీజేపీతోనే సాధ్యం అవుతుందని ఆ పార్టీలో చేరినట్లు ప్రకటించారు.