టీడీపీ నేతలవి డ్రామా రాజకీయాలు : జీవీఎల్

టీడీపీ నేతలవి డ్రామా రాజకీయాలు : జీవీఎల్

ఐదున్నర లక్షల కోట్లను సాయం, పెట్టుబడిగా కేంద్రం ఇస్తే  రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ లెక్కలు చెప్పటం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని కంటే చంద్రబాబుకి రియల్ ఎస్టేట్ ఇష్టమని వ్యాఖ్యానించారు. ఏపీలో సినీ ఫక్కీలో టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రైతులను కూడా పార్టీల వారీగా చీల్చి అన్నదాత సుఖీభవ పథకాన్ని టీడీపీ అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని, టీడీపీని నమ్మే స్థితిలో లేరని జీవీఎల్ అన్నారు. మోడీ ఏపీలో అడుగు పెట్టినప్పటి నుంచి టీడీపీకి కష్టాలు ఎక్కువయ్యాయని ఎద్దేవా చేసారు.