పవన్ కళ్యాణ్ పై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ పై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోడీ వైజాగ్ సభలో ప్రజలు కేరింతలు చూస్తే.. ఏపీ లో బీజేపీ బలం కనిపిస్తుందని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్థాన్ పై మెరుపుదాడి చేసిన ఘనత మోడీ కే దక్కుతుందన్నారు. పాకిస్థాన్ మెడలు వంచి అభినందన్ ని భారత్ కి అప్పగించేలా మోడీ చేశారని జీవీఎల్ చెప్పుకొచ్చారు. నిజమైన హీరో లా ప్రజలందరూ మోడీ ని చూస్తున్నారని కొనియాడారు. ప్రపంచ దేశాలు మోడీ ని గౌరవిస్తే.. మన దేశ రాజకీయ నేతలు అగౌరవ పరిచారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పీకే అంటే పాకిస్తాన్  మనిషి అని పాకిస్తాన్ భావిస్తుందని..పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ఉన్నారని జీవీఎల్ ఆరోపించారు. అధికారానికి దారేది లా.. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో అనే  డైలాగ్ ని పవన్ నిజం చేస్తున్నాడని ఎద్దేవా చేసారు.