ఏపీలో మాకు ఆశాజనకమైన ఫలితాలు రాలేదు

ఏపీలో మాకు ఆశాజనకమైన ఫలితాలు రాలేదు

కేంద్రమంత్రి వర్గంలో ఏపీకి ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు స్పందించారు. ఢిల్లీలో ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రాధాన్యత ఇవ్వలేదని అనడం సమంజసం కాదని తెలిపారు. పలు రంగాల్లో నిష్ణాతులను, అనుభవజ్ఞులు, పార్టీ కోసం క్షేత్ర స్ధాయిలో పనిచేసిన వారిని ఏరికోరి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించినట్లు స్పష్టం చేశారు. ప్రాంతాల వారిగా, రాష్ట్రాల వారిగా కేంద్ర మంత్రి పదవులు ఇవ్వరని తెలిపారు. గత ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి ఆశాజనకమైన ఫలితాలు రాలేదని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన అన్ని అంశాలు, కేంద్ర ప్రభుత్వంలో అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని జీవిఎల్ తెలిపారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేయడం ప్రస్తుతం మా లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రకాలుగా కేంద్రం నుంచి తొడ్పాటు అందేలా కృషి చేస్తామని జీవిఎల్ నరసింహరావు తెలిపారు.