పీడీ స్కాంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి

పీడీ స్కాంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏపీలో రూ. 53వేల కోట్లు దారిమళ్లాయని అన్నారు. ప్రభుత్వం ఈ సొమ్మును 58 వేల పీడీ అకౌంట్లలో వేసిందని ఆయన తీవ్ర స్ధాయిలో విమర్శించారు. తమపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని చెప్పుకునే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పీడీ స్కాంపై సమాధానం చెప్పాలని నిలదీశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. కాగ్‌ నివేదికతో ఈ కుంభకోణం బహిర్గతం అవుతుందని, కాగ్‌ దృష్టి నుంచి ఈ విషయాన్ని తప్పించలేరని అన్నారు. టీడీపీ నాయకులు అవినీతి దొంగల్లా మట్లాడుతున్నారని, తాను అడిగిన ప్రశ్నలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు షేర్ మార్కెట్ బ్రోకర్ అని ఆయన సమాధానం చెప్పడమేంటని ప్రశ్నించారు. బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కి పట్టిన గతే మీకు పడుతుందని టీడీపీ నేతలను హెచ్చరించారు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక షేర్‌ మార్కెట్‌ బ్రోకర్‌తో సమాధానం చెప్పిస్తున్నారని విమర్శించారు. 53 వేల కోట్ల అవినీతిపై శ్వేత పత్రం విడుదల చేయాలని జీవీఎల్‌ డిమాండ్‌ చేశారు.