నేను ఎంపీగా ఉండగానే రైల్వేజోన్...

నేను ఎంపీగా ఉండగానే రైల్వేజోన్...

తాను ఎంపీగా ఉండగానే విశాఖకు రైల్వే జోన్ వస్తుందని స్పష్టం చేశారు విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు... రాజకీయ పార్టీలు వారి రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తూ ఉంటాయి... ఇది సహజం అని వ్యాఖ్యానించిన ఆయన... కేంద్రం, రాష్ట్రానికి ఏం చేయలేదు అనేది ఒక రాజకీయ నిర్ణయం మాత్రమేనని కొట్టిపారేశారు. ఏపీకి రావాల్సిన హామీలన్నీ కేంద్రం అమలు చేస్తోందని... చేయనని ఎక్కడచెప్పలేదని గుర్తు చేసిన హరిబాబు... ప్రత్యేకహోదా బదులు దాని ద్వారా వచ్చే అన్ని ప్రయోజనాలని ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం అన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు కోసం మరో స్థలాన్ని సూచించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపిన హరిబాబు... ఇప్పటికీ రాష్ట్రప్రభుత్వం సూచించలేదని విమర్శించారు. 

హోదా అనే మాట ఉండదు... తప్పితే...

ప్రత్యేక హోదా అనే మాట ఉండదు... తప్పితే ఆంధ్రప్రదేశ్ కు ఎంత న్యాయం చేయాలో అంత కంటే ఎక్కువ న్యాయమే చేస్తామన్నారు బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు... విశాఖలో మీడియాలో మాట్లాడిన ఆయన... పెట్రోలియం యూనివర్సిటీకి స్థలాన్ని  నేటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించలేదని ఆరోపించారు. కేంద్ర ఆర్థికమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేశారని... విదేశీ సంస్థల ద్వారా ఆర్థిక సహాయం తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఓరల్‌గా చెప్పిన మాట వాస్తవమే అయినప్పటికీ... లిటరల్‌గా అడిగితే ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం 11 సంస్థలో 10 మంజూరు చేశామని వెల్లడించారు హరిబాబు... ఆంధ్రప్రదేశ్ ని ఆదుకోవడం కోసం చట్టంలో లేనివి అనేకం చేశామని ప్రకటించిన బీజేపీ ఎంపీ... విభజన హామీలు అమలుకు 10 ఏళ్ల సమయం ఉన్నా... అంతకన్నా ముందే అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.