బీజేపీ ఎంపీల ఫోన్లు ట్యాప్‌?

బీజేపీ ఎంపీల ఫోన్లు ట్యాప్‌?

తమ ఫోన్లను రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ట్యాప్‌ చేస్తోందని బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు ట్యాప్‌ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వీరు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు విడిగా లేఖలు రాశారు. స్పీకర్‌కు లేఖ రాసిన ఎంపీల్లో శోభ కరంద్లాజ్‌, పీపీ మోహన్‌, జీఎం సిద్ధేశ్వర ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఓట్ల కౌంటింగ్‌ పూర్తయ్యాక... కర్ణాటకలో రాజకీయ పరిస్థితి నాజుగ్గా తయారైందని వీరు అన్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని బీజేపీ నేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్‌ చేస్తోందని వీరు ఆరోపించారు. తమ ఫోన్లకు కూడా గుర్తు తెలియని వ్యక్తులు వింటున్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు. ఇలాంటి జరగకుండా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని వీరు స్పీకర్‌ను కోరారు.