బెంగాల్‌లో మ‌మ‌త ప‌ట్టు కోల్పోతుందా?

బెంగాల్‌లో మ‌మ‌త ప‌ట్టు కోల్పోతుందా?

ఈ ఏడాదిలో ప‌శ్చిమ బెంగాల్‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు బీజేపీ పావులు క‌దుపుతున్న‌ది.  ఒక‌వైపు మ‌మ‌త ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూనే, మ‌రోవైపు ఆ పార్టీనుంచి వ‌స్తున్న నేత‌ల‌ను పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు.  ఇప్ప‌టికే అనేక‌మంది నేత‌లు పార్టీలో జాయిన్ అయ్యారు.  టియంసీ కీల‌క నేత సుబేందు అధికారి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు బీజేపీలో చేరడం టీఎంసీకి గ‌ట్టిదెబ్బ అని చెప్పాలి.  ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది మ‌మ‌త స‌ర్కార్‌పై బీజీపీ నేత‌లు వ‌ర‌స విమ‌ర్శ‌లు చేస్తున్నారు.  ఈ విమ‌ర్శ‌లను మ‌మ‌త తిప్పి కొడుతున్నా, ఫ‌లితం ఉండ‌టంలేదు.  పైగా బీజేపీ అగ్ర‌నేత‌లు వ‌ర‌స‌గా బెంగాల్లో ప‌ర్య‌టిస్తూ హడావుడి చేస్తుండ‌టం కూడా టిఎంసీకి ఇబ్బందుకు క‌లిగిస్తున్నాయి.  ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర ప‌థ‌కాలు అవ‌స‌రం లేద‌ని చెప్పిన మ‌మ‌త, ఇప్పుడు హ‌డావుడిగా పీఎం కిసాన్ యోజ‌నను అమ‌లు చేయ‌డానికి సిద్దం కావ‌డంతో బెంగాల్‌పై మ‌మ‌త ప‌ట్టుకోల్పోతున్నారని బీజేపీ నేత‌లు అంటున్నారు.  క‌రోనా స‌మ‌యంలో కేంద్రం ఇచ్చిన రేష‌న్‌ను రాష్ట్రప్ర‌భుత్వం దుర్వినియోగం చేసింద‌ని, టిఎంసీ కార్య‌క‌ర్త‌లు త‌మ ఇళ్ల‌ను రేష‌న్ కార్యాల‌యాలుగా మార్చుకున్నారని జేపీ న‌డ్డా విమ‌ర్శించారు.