ఇవి కంటైనర్లు కావు... బీజేపీ కార్యాలయం... 

ఇవి కంటైనర్లు కావు... బీజేపీ కార్యాలయం... 

తమిళనాడు ఎన్నికలకు నగారా మోగింది.  అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి.  బీజేపీ నేత, నటి కుష్బూ కూడా ఎన్నికల కార్యక్రమాల్లో బిజీ అయ్యారు.  ప్రస్తుతం చెపాక్-ట్రిప్లికేన్ నియోజక వర్గ ఇంచార్జ్ గా ఉన్నారు కుష్బూ.  నియోజక వర్గంలో పర్యటిస్తూ, నాయకులతో చర్చలు జరిపేందుకు వీలుగా అన్నాసాలై లోని ఎల్ఐసి కార్యాలయం సమీపంలోని ఓ గ్రౌండ్ లో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు.  అయితే, ఈ కార్యాలయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  రెండు కంటైనర్లు తీసుకొచ్చి అందులో ఆఫీస్ కు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు.  ఏసీ, ఫర్నిచర్, టాయిలెట్ వంటి వసతులను కంటైనర్ లో ఏర్పాటు చేసుకున్నారు.  100 మందితో సమావేశం అయ్యేందుకు వీలుగా ఈ మీటింగ్ హాల్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు.  ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.