కుంభమేళాలో అమిత్ షా, యోగి పవిత్ర స్నానాలు

కుంభమేళాలో అమిత్ షా, యోగి పవిత్ర స్నానాలు

కుంభమేళాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం ప్రయాగరాజ్ లోని పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేశారు. ఆ తర్వాత షా సాధువులతో కలిసి భోజనం చేశారు. ఈ ఒకరోజు పర్యటన కోసం ప్రయాగరాజ్ వచ్చిన అమిత్ షాతో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర నేతలు కూడా ఉన్నారు. స్నానం చేసే సమయంలో సాధువులంతా హరహర మహాదేవ్ అంటూ నినాదాలు చేశారు.

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం మధ్యాహ్నం ప్రయాగరాజ్ చేరుకున్నారు. సంగమం కొసపై త్రివేణిలో సాధువులతో కలిసి పవిత్ర జలాల్లో మునకలేశారు. అంతకు ముందు షా గంగా హారతిలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో షా అక్షయ వటవృక్ష దర్శనం, పెద్ద హనుమంతుడి మందిరం, సరస్వతి కూపాల దర్శనం చేసుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ఒక రోజు పర్యటనలో ఆయన సాధువులతో కలిసి భోజనం చేశారు.