ఎన్డీఏ నేతలకు అమిత్‌షా డిన్నర్..

ఎన్డీఏ నేతలకు అమిత్‌షా డిన్నర్..

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి... ఇక ఎగ్జిట్ పోల్స్‌లోనూ మరోసారి కేంద్రం బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మరోవైపు ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో రేపు ఎన్డీఏలోని అన్ని పార్టీల నేతలను విందు ఇవ్వనున్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా. ఇక రేపు కేంద్రమంత్రులు కూడా సమావేశమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఫలితాలకు రెండు రోజుల ముందు ఎన్డీఏ పక్షాలకు డిన్నర్ ఏర్పాటు చేసిన అమిత్‌షా.. ఎన్నికల ఫలితాల తర్వాత వ్యవహరించాల్సిన తీరుపై చర్చించే అవకాశం ఉందంటున్నారు.