ప్రత్యేక హోదా ప్రస్తావన తేవొద్దుః కన్నా

ప్రత్యేక హోదా ప్రస్తావన తేవొద్దుః కన్నా

వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రజలను మోసం చేయవద్దని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిందని తెలిపారు. అప్పట్లో సమైక్యాంధ్ర అంటూ జనాన్ని మభ్యపెట్టి అందరూ ఉద్యమాలు చేశారని ఆయన గుర్తుచేశారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశం కావున జగన్ మోహన్ రెడ్డి జనాలను మోసం చేయవద్దని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుతో పొత్తు కారణంగానే బీజేపీ నష్టపోయిందని ఆరోపించారు. ఏపీలో జగన్ కు 130కి పైగా సీట్లు వస్తాయని నేను ముందుగానే చెప్పానని అన్నారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి రావడం వల్ల బీజేపీ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలవబట్టే రాహుల్ గాంధీ దెబ్బతిన్నాడని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.