ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనుల్లో బీజేపీ

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనుల్లో బీజేపీ

కొద్దిసేపటి క్రితమే జరిగిన విశ్వాస పరీక్షలో కుమారస్వామి సర్కార్ ఓటమిపాలైంది.  దీంతో భాజాపా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి సిద్ధమవుతోంది.  కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా బీజేపీ నేతలు గవర్నర్ వాజూభాయ్ వాలాను కలవనున్నారు.   బలపరీక్ష అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రజా విజయమని, తమ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు.