బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గం నియామకం..

బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గం నియామకం..

రెండో సారి తిరుగులేని విజయంతో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఇవాళ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గం ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీని పార్లమెంటరీ పార్టీ నేతగా...లోకసభ డిప్యూటీ లీడర్‌గా రాజ్‌నాథ్‌సింగ్‌ను నియమించింది. ఇక రాజ్యసభ లీడర్‌గా తావర్ చంద్ గెహ్లాట్‌ను నియమించిన బీజేపీ... రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా పీయూష్ గోయల్ నియమించింది. కాగా, తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 17, 18 తేదీల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రొటెమ్ స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనుండగా... 19వ తేదీన లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక జులై 5వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.