జగన్ మీద బీజేపీ 'మత' విమర్శలు 

జగన్ మీద బీజేపీ 'మత' విమర్శలు 

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఓ కార్యక్రమంలో జ్యోతిని వెలిగించి, సభను ప్రారంభించాలని నిర్వాహకులు కోరిన వేళ ఆయన నిరాకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఏపీ బీజేపీ ఇన్ చార్జీ సునీల్ దేవ్ ధర్, ఎంపీ సీఎం రమేశ్ తదితరులు జగన్ తీరును తప్పుపట్టారు.  

"వైసీపీ అధ్యక్షుడు జగన్ గారు అమెరికాలో ఒక కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడానికి నిరాకరించడం ఖచ్చితంగా హిందువులను అవమానించడమే. ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసమే ఆయన దేవాలయాల చుట్టూ తిరుగుతూ నటించారని అర్థం అవుతుంది" అని సీఎం రమేష్ ట్వీట్ చేశారు. జగన్ ఆ దీపాన్ని వెలిగించడానికి ఎందుకు ఇష్టపడలేదని? తాను ఇతర మతస్థుడు కాబట్టే ఇలా చేసారా? వేరే మతాల ఓట్లను కేవలం తన రాజకీయ లబ్ది కోసమే డ్రామాలు ఆడి వోట్లు వేయించుకున్నారా? రాహుల్ గాంధీలానే బాగా నటించారని సునీల్ పేర్కొన్నారు. ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ అని, ఆయన చాలా బాగా రాసాడని ఆయన విమర్శించారు.