కంటి, పంటి చికిత్సకు కేసీఆర్ ఢిల్లీ వెళ్తారు...

కంటి, పంటి చికిత్సకు కేసీఆర్ ఢిల్లీ వెళ్తారు...

కంటి, పంటి చికిత్స కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్తారు కానీ ఇక్కడి హాస్పిటల్స్ ని ఏమాత్రం పట్టించుకోరని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఆయనకు సభపై ఉన్న ఇంట్రెస్ట్ రాష్ట్రంలోని ఆసుపత్రులపై లేదన్నారు. పెచ్చులు ఊడి రోగిపైన పడినా  కాపాడే దిక్కులేదని విమర్శించారు. ఆసుపత్రుల విషయంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చెప్పింది ఒకటి ఇప్పుడు చేస్తోంది మరొకటి అని పేర్కొన్నారు. మీకు మాత్రం కార్పొరేట్ ఆస్పత్రులు కావాలి, ప్రజలకి మాత్రం దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న ఆస్పత్రులు కావాలా అని ప్రశ్నించారు. ఎన్నికల అంశం వచ్చినప్పుడు మోడీని తిట్టడం కేసీఆర్ కు అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందింస్తోందని గుర్తు చేశారు. కేంద్ర సహకారం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు పడదని తెలిపారు. ముందస్తుకి మోడీ ఒప్పకున్నారనేది హాస్యాస్పదమని తెలిపారు. కేసీఆర్ చెప్పినట్టు ఢిల్లీ నడవదనీ... పొత్తు కూడా ఉండదని శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.