బీజేపీకి జస్వంత్ కుమారుడు గుడ్‌ బై?

బీజేపీకి జస్వంత్ కుమారుడు గుడ్‌ బై?

మాజీ కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్‌ కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే మానవేంద్ర సింగ్ బీజేపీకి గుడ్ బై చెబుతున్నారంటూ ఇపుడు రాజస్థాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర సీఎం వసుంధర రాజే ప్రారంభించిన రాజస్థాన్ గౌరవ యాత్రకు మానవేంద్ర సింగ్ దూరంగా ఉండటంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన బీజేపీని వీడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. షియో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మానవేంద్ర సింగ్ ఈనెల 22వ తేదీన బార్మర్ పట్టణంలో తన నేతృత్వంలో స్వాభిమాన్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ మా ఆత్మగౌరవానికి సంబంధించిందని ఆయన మీడియాతో అన్నారు. మీరు కాంగ్రెస్ లో చేరుతున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని అన్నారు. వసుంధర రాజే పాలన పట్ల రాజ్ పూత్ లు తీవ్రం ఆగ్రహంగా ఉన్నారు.