నీళ్లు, నిధులు, నియామకాల ఊసేలేదు..!

నీళ్లు, నిధులు, నియామకాల ఊసేలేదు..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు గడిచినా నీళ్లు, నిధులు, నియామకాల ఊసే లేదని ఆరోపించారు బీజేపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్. నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన... కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తూ విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఇంటర్ పేపర్ మూల్యాంకనం గ్లోబరీనా సంస్థకు అప్పజెప్పడంలో మతలబ్ ఏంటని ప్రశ్నించిన లక్ష్మణ్... ప్రభుత్వ తప్పిదంతో ఇంటర్ విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడాలేదని మండిపడ్డారు. ఆత్మబలిదానాల మధ్య ఏర్పడ్డ తెలంగాణలో అన్ని అంశాలు మరుగునపడ్డాయన్నారు. గ్లోబరీనా తప్పిదానికి బాధ్యతగా మంత్రి జగదీష్ రెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్.