ప్రజలే కేసీఆర్ సర్కార్‌ను డిస్మిస్ చేస్తారు..!

ప్రజలే కేసీఆర్ సర్కార్‌ను డిస్మిస్ చేస్తారు..!

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది.. రాష్ట్రవ్యాప్తంగా రోజుకో రూపంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కార్మికులు. వీరికి మద్దతుగా వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు సైతం ఉద్యమంలోకి వచ్చాయి. అయితే, ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్.. ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేయడం కాదు.. ప్రజలే కేసీఆర్ సర్కార్‌ను డిస్మిస్ చేస్తారని హెచ్చరించారు. ఇక హూజూర్‌నగర్ ఉప ఎన్నికల కోసమే చర్చల డ్రామా ఆడుతున్నారని ఆరోపించిన లక్ష్మణ్.. ఇన్ని రోజులు దసరా సెలవులు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని ఎద్దేవా చేశారు. అయితే, తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం మాత్రం బీజేపీయే అన్నారు లక్ష్మణ్‌.