మమతా బెనర్జీ ఫోటో మార్ఫింగ్, అరెస్ట్

మమతా బెనర్జీ ఫోటో మార్ఫింగ్, అరెస్ట్

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫొటో షేర్‌ చేసిన ఓ బీజేపీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. మమత పరువుకు భంగం కలిగించారంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రియాంక శర్మను మే10న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత సోమవారం న్యూయార్క్‌లో మెట్‌గాలా ఫ్యాషన్‌ షో - 2019 జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నిక్‌ జోనస్‌ పింక్‌ కార్పెట్‌పై నడిచారు. సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అయితే, ప్రియాంక ఫొటోతో మమతా బెనర్జీ చిత్రాన్ని మార్పింగ్‌ చేసి కొందరు ఔత్సాహికులు సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.