'300 సీట్లు సింగిల్ గా గెలుస్తున్నాం'

'300 సీట్లు సింగిల్ గా గెలుస్తున్నాం'

బీజేపీ ఎప్పుడూ సర్వేల మీద ఆదారపడలేదు. 300 సీట్లు సింగిల్ గా గెలుస్తున్నాం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. ఈ రోజు ఆయన నిజామాబాద్ లో మాట్లాడుతూ... ఎన్డీయే మిత్ర పక్షాలు గ్రాఫ్ పడిపోయిందనే ప్రచారంలో లేదు, దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రానుందన్నారు. 2014తో పోల్చితే ఇప్పుడు ఎన్డీయే మరింత బలోపేతం అయింది. చాలా వరకు ప్రాంతీయ పార్టీలన్నీ ఎన్డీయే వైపు వచ్చాయన్నారు. తమిళనాడులో దక్షీణాదిలో అతిపెద్ద కూటమి బీజేపీతో ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ తో కలవడానికి ప్రాంతీయా పార్టీలన్నీ విబేదిస్తున్నాయని మురళీధర్ రావు అన్నారు. ప్రతిపక్షాల్లో నాయకత్వం‌ లేదు, రాహుల్ గాంధీని అంగికరించే పార్టీలు లేవన్నారు. యూపిఏకు చంద్రబాబు సిద్దాంత కర్తగా మారినా.. ఏపీలో ఎందుకు కలిసి పోటి చేయడం లేదు. రాహుల్ ను ప్రధాని చేయాలని.. చంద్రబాబు ఎందుకు కలిసి పొటీ చేయడం లేదని ప్రశ్నించారు. 

బీజేపీ రేపటి‌ నుండి అంచల వారిగా అభ్యర్థులను ప్రకటించనుందని మురళీధర్ రావు తెలిపారు. బీజేపీ ఎప్పుడూ సర్వేల మీద ఆదారపడలేదు, 300 సీట్లు సింగిల్ గా గెలుస్తున్నాం. రాహుల్ గాంధీ మాటలు చౌకబారులా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీ.. కానీ అది రాష్ట్రానికి మాత్రమే పరిమితం అని ఆయన అన్నారు.