ఎన్సీపీ కార్యకర్తపై బీజేపీ కార్యకర్తల దాడి..

ఎన్సీపీ కార్యకర్తపై బీజేపీ కార్యకర్తల దాడి..

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో బీజేపీ ఎంపీ అభ్యర్ధి ప్రగ్యాసింగ్ ఠాకూర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నిర్వహించిన రోడ్ షోలో ఎన్సీపీ కార్యకర్త నల్లజెండా తో నిరసన తెలిపాడు. ఈ విషయం గమనించిన బీజేపీ కార్యకర్తలు అతడిపై దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన సాధ్వి ప్రగ్యాసింగ్ ఏప్రిల్ 17న బీజేపీలో చేరడంతో ఆమెకు భోపాల్ లోక్‌సభ స్థానాన్ని ఆ పార్టీ కేటాయించిన సంగతి తెలిసిందే.