కొకైన్‌తో దొరికిపోయిన బీజేపీ యువ మోర్చ నేత పమేలా గోస్వామి..

కొకైన్‌తో దొరికిపోయిన బీజేపీ యువ మోర్చ నేత పమేలా గోస్వామి..

భారతీయ జనతా పార్టీకి చెందిన యువ నేత కొకైన్‌తో పోలీసులకు దొరికిపోయారు.. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది... పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. కోల్‌కతాలోని న్యూ అలీపూర్‌ ప్రాంతంలో ఎన్‌ఆర్‌ అవెన్యూ నుంచి బీజేపీ యువ మహిళా నేత పమేలా గోస్వామి.. కారులో కొకైన్ తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు.. నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. ఆ సమయంలో.. పమేలా గోస్వామితో పాటు ఆమె స్నేహితుడు, బీజేపీ నేత ప్రవీర్‌ కుమార్‌ దేవ్‌ కూడా కారులో ఉన్నాడు.. ఆమె కొకైన్‌తో కారులో చిక్కిన సమమంలో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని చెబుతున్నారు పోలీసులు.. మొదట కారు ఆపి పోలీసులు సోదాలు నిర్వహించగా.. ఆమె బ్యాగ్‌తో పాటు కారు సీటు వద్ద నార్కోటిక్స్‌ గుర్తించారు. పమేలా నుంచి 100 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఇక, ఆమెకు ఆ గ్రడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరికి సంబంధాలున్నాయి అనే విషయాలపై ఫోకస్ పెట్టారు పోలీసులు.. అయితే, ఈ ఘటనపై రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి షామిక్ భట్టాచార్య మాట్లాడుతూ.. నాకు ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.. తెలియకుండానే దీనిపై వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మొత్తంగా పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతోన్న సమయంలో.. బీజేపీ నేత డ్రగ్స్‌తో దొరికిపోవడం సంచలనంగా మారిపోయింది.