ఓటమి బాటలో కర్ణాటక మాజీ సీఎం దేవేగౌడ

ఓటమి బాటలో కర్ణాటక మాజీ సీఎం దేవేగౌడ

జేడీఎస్ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ సీఎం దేవేగౌడ ఓటమిబాటలో పయనిస్తున్నారు. తుముకూరు అసెంబ్లీ నియోజవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయనకు బీజేపీకి చెందిన జీఎస్ బసవరాజ్ గట్టి పోటీనిస్తున్నారు. హసన్ స్థానాన్ని తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు ఇచ్చి తుముకూరు నుంచి బరిలోకి దిగారు. కర్ణాటక అసెంబ్లీకి దేవేగౌడ 1962 నుంచి ఏడు సార్లు విజయం సాధించారు. 1991 నుంచి ఆరు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. హసన్ లోక్ సభ స్థానం నుంచి జేడీఎస్ తరుపున బరిలోకి దిగిన దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ దూసుకుపోతున్నారు. బీజేపీకి చెందిన మంజు పై 1.2 లక్షల ఓట్ల మెజార్టీలో ఉన్నారు.