వేములవాడలో క్షుద్రపూజల కలకలం.!

వేములవాడలో క్షుద్రపూజల కలకలం.!

వేములవాడలో క్షుద్రపూజల కలకలం రేగింది. వేములవాడ మండలం అగ్రహారం గుట్టల్లో భూత వైద్యం పేరుతో ఓ మాంత్రికుడు క్షుద్రపూజలు చేస్తున్నాడు. మాంత్రికుడు అనారోగ్యంతో బాధ పడుతున్న వారిని నయం చేస్తానని నమ్మించి జనాలను మోసం చేస్తున్నాడు. కాగా స్థానికులు గమనించి  వీడియోలు తీయడంతో మాంత్రికుడు అక్కడ నుండి పారిపోయాడు. ఇంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు,కుటుంబ సమస్యలు నయం చేస్తానంటూ వేములవాడ మండలం అగ్రహారం గుట్టల్లోకి తీసుకెళ్లి  క్షుద్రపూజలు పేరుతో భూత వైద్యం చేస్తూ పలువురిని మోసం చేస్తున్నాడు. స్థానికులు మాంత్రికుడిని నిలదీయడంతో పరార్ అయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.