వీడియోతీసి బ్లాక్‌మెయిల్, పదే పదే రేప్! కేంద్ర మాజీ మంత్రిపై ఫిర్యాదు!

వీడియోతీసి బ్లాక్‌మెయిల్, పదే పదే రేప్! కేంద్ర మాజీ మంత్రిపై ఫిర్యాదు!

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్‌పై సంచలన ఆరోపణలు చేసింది 23 ఏళ్ల లా విద్యార్థిని.. చిన్మయానంద్‌ త‌న‌ను బెదిరించి, వీడియోలు తీసి, బ్లాక్ మెయిల్ చేసి పదే పదే అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఒక ఏడాది పాటు తనను లైంగికంగా వేధించినట్టు పోలీసులకు తెలిపింది విద్యార్థిని. ఈ ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ముందు తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని కన్నీరుమున్నీరైంది. దాదాపు 15 గంటల పాటు సిట్ ఆ మహిళను ప్రశ్నించింది.. ఈ సందర్భంగా ఆమె చూపించిన వీడియోనులు సిట్ పరిశీలిచింది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన చిన్మయానంద్‌కు అక్కడ అనేక ఆశ్రమాలు, విద్యాసంస్థలు ఉన్నాయి. అయితే, తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్న బాధితురాలు... గత ఏడాది జూన్‌లో ష‌హ‌జాన్‌పూర్ కాలేజీలో చేరే ముందు చిన్మయానంద్‌ను కలిశాను.. అప్పుడే ఆయన తన ఫోన్ నంబర్ తీసుకున్నాడని.. కాలేజీ లైబ్రరీలో రూ.5 వేల ఉద్యోగం కూడా ఇస్తానని చెప్పారని ఆమె పేర్కొంది. మొదట హాస్టల్‌లో సీటు ఇప్పించాడని.. ఆ త‌ర్వాత ఆశ్రమానికి ర‌మ్మన్నాడ‌ని తెలిపింది. అయితే, హాస్టల్‌లో స్నానం చేస్తుండగా.. వీడియో తీసి తనను బ్లాక్‌మెయిల్ చేశాడని ఆరోపించిన విద్యార్థిని.. ఆ త‌ర్వాత రేప్ చేసి వీడియో తీసి కూడా ప‌దేప‌దే అత్యాచారం చేశాడని సిట్ ముందు గోడు వెల్లబోసుకుంది. 12 పేజీలతో తన ఫిర్యాదులో సిట్‌కు అన్ని వివరాలు తెలిపింది. చిన్మయానంద్‌కు మసాజ్ చేయాలని అతని గన్‌మన్లు తరచూ గన్‌ ఎక్కుపెట్టి బెదిరించారని.. ఏడాది పాటు ఈ వేధింపులు బరించి.. ఏడాది తర్వాత ఆగస్టు నెలలో ఓ వీడియో తీసింది బాధితురాలు.. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి పారిపోయింది. అనంతరం.. ఆ వీడియోను చూపిస్తూ చిన్నయానంద్ అనేక మంది బాలికలను మోసం చేశారని ఆరోపించారు. చిన్మయానంద్‌పై కిడ్నాప్, బెదిరింపుల వంటి ఫిర్యాదులు చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయలేదు. కాగా, ఆ మహిళను వారం రోజుల తర్వాత రాజస్థాన్‌లో గుర్తించారు పోలీసులు.. అనంతరం ఆమెను సుప్రీంకోర్టులో హాజరుపర్చారు. గత వారం ఢిల్లీలో ఫిర్యాదు చేసిన బాధితురాలు.. యూపీ పోలీసులపై తనకు నమ్మకంలేదని పేర్కొంది. అయితే, దర్యాప్తు ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడానికి ఇబ్బంది లేదు.. కానీ, మొదట నిందితుడిని అరెస్ట్ చేయాలని కోరింది. తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నా.. నా తండ్రిని పోలీసులు బెదిరిస్తున్నారని మీడియాకు తెలిపిన బాధితురాలు.. హాస్టల్ గదిలో అన్ని ఆధారాలున్నాయి.. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని తెలిపారు.