హైదరాబాద్‌లో భారీ పేలుడు..

హైదరాబాద్‌లో భారీ పేలుడు..

హైదరాబాద్‌లో మరోసారి పేలుడు కలకలం సృష్టించింది. రాజేంద్రనగర్‌లో భారీ పేలుడు సంభవించింది... ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తి ఓ బాక్స్‌ను తెరిచేందుకు ప్రయత్నించగా అది పేలింది. దీంతో ఆ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యారు. రాజేంద్రనగర్.. పిల్లర్ నంబర్ 173 దగ్గర ఈ పేలుడు సంభవించింది. బాక్స్‌ తెరవగానే భారీ శబ్థంతో పేలింది.. ఈ ఘటనలో ఆ వ్యక్తి రెండు చేతులు తెగిపోయి దాదాపు 10 మీటర్ల దూరంలో పడ్డాయని అంటున్నారు. బాధితుడు బిచ్చగాడిగా అనుమానిస్తున్నారు పోలీసులు.. రోడ్డుపై, చెత్త కుప్పల్లో సేకరించిన వస్తువులను తన బ్యాగులో వేసుకుని అక్కడ కూర్చొని.. తనకు దొరికిన టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయగా అది పేలినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్.. ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.