హైదరాబాద్‌లో పేలుడు కలకలం.. మహిళకు తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లో పేలుడు కలకలం.. మహిళకు తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లో పేలుడు కలకలం సృష్టించింది.. మీర్‌పేట్‌లోని విజయపురికాలనీలో ఈ పేలుడు సంభవించింది. చెత్తకుప్పలో ఉన్న  ఓ డబ్బా ఒక్కసారిగా పేలింది. చెత్త ఏరుకుంటున్న మహిళ.. ఆ డబ్బును తెరిచే ప్రయత్నం చేసింది.. డబ్బాను నేలకేసికొట్టి తెరిచే ప్రయత్నం చేసింది.. దీంతో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. మహిళ తీవ్రగాయాలపాలైంది. షాక్ తిన్న స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న మీర్‌పేట్ పోలీసులు.. డబ్బాను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళను ఆస్పత్రికి తరలించారు.