సికింద్రాబాద్‌లో పేలుడు.. ఒకరు సజీవదహనం..

సికింద్రాబాద్‌లో పేలుడు.. ఒకరు సజీవదహనం..

సికింద్రాబాద్ మారేడ్ పల్లిలో ఒక్క సరిగా పేలుళ్లు కలకలం రేపాయి.. వరుస పేలుళ్లతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి భవనం పై అంతస్తు నేలకూలింది. ఏరో సెల్ సైక్లిండర్ స్టోర్ రూమ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సేఫ్టీ సైక్లిండర్‌లు ఎక్కడ స్టోర్ చేసి పెట్టగా.. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అందులో పని చేస్తున్న ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు.. మరో వ్యక్తి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి బిల్డింగ్ కూలి శకాలలు కింద ఉన్న వాహనాలపై పడడంతో మూడు కార్లు, రెండు బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మారేడ్ పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సజీవదహనమైన వ్యక్తి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రాజు (30)గా గుర్తించారు.