ఆ సైట్లను బ్లాక్ చేయాలని హైకోర్టు ఆదేశం

ఆ సైట్లను బ్లాక్ చేయాలని హైకోర్టు ఆదేశం

నిర్మాణ సంస్థల వీడియోలు, రిలీజైన కొత్త సినిమాలు వెంటనే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో ప్రత్యక్షమవుతున్నాయి.. ఇవి, నిర్మాణ సంస్థలకు, నిర్మాతలకు, ఫిల్మ్ మేకర్స్‌కు తలనొప్పిగా మారాయి. కోట్లు ఖర్చు చేసిన సినిమాలు నిర్మిస్తే.. తొలి షో ఆడకముందే అవి నెట్‌లో దర్శనమిస్తున్నాయి. అయితే, అమెరికాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌‌.. తమ నిర్మాణ సంస్థ నుంచి వెలువడిన చిత్రాలను, వెబ్‌ సిరీస్‌లను అనధికారికంగా తమిళ్‌ రాకర్స్‌ వంటి ప్రైవేటు వెబ్‌సైట్స్‌ వీక్షకులకు ఫ్రీగా అందిస్తున్నాయని హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు.. అలాంటి వైబ్‌సైట్లకు నెటిజన్స్‌ ప్రవేశించకుండా వాటి యూఆర్‌ఎల్స్‌, ఐపీ అడ్రెస్‌లను బ్లాక్‌ చేయవలసిందిగా ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు సూచించింది. 

మరోవైపు నిర్మాణ సంస్థలకు చెందిన కాపీరైట్లను ఉల్లంఘించినందుకు ఆ వెబ్‌సైట్లపై నమోదు చేసిన డొమైన్‌ పేర్లను తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖకు ఆదేశించింది హైకోర్టు. నెట్‌ఫ్లిక్స్‌, యూనివర్సల్‌, పారామౌంట్‌, స్టార్‌కి చెందిన కాపీరైట్‌ కంటెంట్లను వాడుతోన్న వెబ్‌సైట్స్‌పై నిఘాపెట్టాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు తగిన నోటిఫికేషన్‌ జారీ చేయాల్సిందిగా డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ టెలీకమ్యూనికేషన్స్‌కు సూచించింది ఢిల్లీ హైకోర్టు.