ఆక్టోపస్‌ను తిందామనుకుంది.. ఇంతలో

ఆక్టోపస్‌ను తిందామనుకుంది.. ఇంతలో

బతికున్న ఆక్టోపస్‌ను తిందామనుకున్న ఓ యువతికి భయానక అనుభవం ఎదురైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. లక్షల సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. వివరాల్లోకి వెళితే.. ఓ చైనీస్ బ్లాగర్ ప్రాణంతో ఉన్న ఆక్టోపస్‌ ను తినాలనుకుంది. దానిని ఎత్తుకుని నోట్లో పెట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఆక్టోపస్‌ తన మీసాలతో ఆమె ముఖాన్ని గట్టిగా పట్టుకుంది. దీంతో దానిని విడిపించుకునేందుకు ఆమె చాలా ప్రయత్నించింది. ప్రాణాలు రక్షించుకునేందుకు ఆక్టోపస్‌ చేసిన ఎదురుదాడిలో సదరు యువతి ముఖంపై గాయాలయ్యాయి. ఏడూస్తూనే, చాలా సేపు ప్రయత్నించి దాని నుంచి ఎలాగోలా తప్పించుకుంది. అయితే దాని ప్రభావం వల్ల ఆమె మొహం మీద చిన్నపాటి గాయమే అయింది. చైనీస్‌ ఫొటో షేరింగ్ యాప్ కువైషౌలో ఆ యువతి ఈ క్లిప్‌ను షేర్‌ చేస్తూ తొందరలో ఉన్నప్పుడు జీవంతో ఉన్న ఆక్టోపస్‌ను తినడానికి ప్రయత్నించొద్దని ఉచిత సలహా కూడా ఇచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పలువురు నెటిజన్లు స్పందించారు. ‘అసలు నీకు మతి ఉండే ఇలా చేశావా...  బతికున్న ఆక్టోపస్‌ను తినాలని ఎలా అనుకున్నావు’ అంటూ నెటిజన్లు ఆమె చర్యను తప్పుబడుతున్నారు.