రివ్యూ : బ్లఫ్ మాస్టర్ 

రివ్యూ : బ్లఫ్ మాస్టర్ 

నటీనటులు : సత్యదేవ్, నందిత శ్వేతా, బ్రహ్మాజీ, పృద్విరాజ్, ఆదిత్య మీనన్ తదితరులు 

సంగీతం : సునీల్ కాశ్యప్ 

ఫోటోగ్రఫి : దాశరథి శైలేంద్ర 

నిర్మాత: రమేష్ పిళ్ళై 

దర్శకత్వం: గోపి గణేష్

తమిళంలో సూపర్ హిట్టైన శతురంగ విట్టై సినిమాను పూరి దగ్గర పనిచేసిన గోపి గణేష్ దర్శకత్వంలో జ్యోతిలక్ష్మి, క్షణం, ఘాజి వంటి సినిమాల్లో కీలక పాత్ర చేసిన సత్యదేవ్ హీరోగా  బ్లఫ్ మాస్టర్ పేరుతో రీమేక్ చేశారు.  ఈరోజు రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.  

కథ : 

ప్రజల అత్యాశను, వారి క్యాష్ వీక్నెస్ ను తన బ్యాంక్ బ్యాలెన్స్ గా మార్చుకుంటుంటాడు సత్యదేవ్.  డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుంటాడు. మనీ కోసం వేషాలు మార్చి జనాలను బురిడీ కొట్టించి డబ్బులు దండుకుంటుంటాడు.  షర్ట్ మార్చినంత ఈజీగా పేరు మార్చుకొని నేరాలు చేస్తూ జీవితాన్ని సాగిస్తుంటాడు.  ఈ సమయంలో అతనికి నందిత శ్వేతా కనిపిస్తుంది.  అమాయకమైన ఆమె మనసు అతన్ని ఆకట్టుకుంటుంది.  అక్కడి నుంచి తన లైఫ్ ను మార్చుకోవాలని చూస్తాడు.  అదే సమయంలో కొన్ని చిక్కుల్లో ఇరుక్కుంటాడు.  ఆ చిక్కుల నుంచి ఎలా బయటపడ్డాడు..? నేరాలను వదిలేశాడా లేదా అన్నది మిగతా కథ.  

విశ్లేషణ : 

మోస పూరితమైన విషయాల గురించి మనం నిత్యం పేపర్లలోనూ, టీవీల్లోనూ చూస్తూనే ఉంటాం.  ఇలాంటి వార్తలు జనాలను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి.  మోసపోకూడదు అనుకుంటూనే మోసపోతుంటారు.  అలా మోసాలు చేసే వ్యక్తిగా సత్యదేవ్ కనిపిస్తాడు.  తన మాటలలతో మాయచేసి ఈజీగా డబ్బు సంపాదిస్తుంటాడు.  అనుకోకుండా తన జీవితంలోకి వచ్చిన నందితను చూసి మనసు మార్చుకొని నేరమయ జీవితం వదిలేసి బ్రతకాలని అనుకుంటాడు.  

అలా తన నేరజీవితాన్ని పక్కన పెట్టిన సమయంలో .. సత్యదేవ్ ప్రత్యర్థి ఆదిత్య మీనన్ అతడిని టార్గెట్ చేస్తాడు.  ఆదిత్య మీనన్ నుంచి ఎలా తప్పించుకున్నాడు.. పాత జీవితాన్ని వదిలేసి తనను ప్రేమించిన నందితను వివాహం చేసుకొని ఎలా జీవించాడు అనే విషయాలను ఇందులో చూపించారు.  తన పాత జీవితాన్ని వదిలేసినా తరువాత, విలన్ ఆదిత్య మీనన్ నుంచి తప్పించుకునే క్రమంలో ఉత్కంఠతను తీసుకొచ్చారు.  ఆ ఉత్కంఠతను చివరివరకు తీసుకొచ్చినా.. దానికి తగ్గ బలమైన సన్నివేశాలు లేకపోవడంతో థ్రిల్లింగ్ లేకుండా సినిమా మాములుగా సాగింది.  

నటీనటుల పనితీరు : 

సత్యదేవ్ యాక్షన్ ఆకట్టుకుంటుంది. రకరకాల వేషాల్లో కనిపించి కనువిందు చేశాడు.  నందితా శ్వేతా అమాయకురాలి పాత్రలో ఆకట్టుకుంది.  ఆదిత్య మీనన్ విలన్ రోల్ బాగుంది.  మిగతా వారి వారి పాత్రకు తగ్గట్టుగా నటించారు.  

సాంకేతిక వర్గం : 

తమిళంలో సూపర్ హిట్టైన సినిమాను తెలుగులో రీమేక్ చేసినా.. అక్కడి సన్నివేశాల బిగుతు ఈ సినిమాలో కనిపించలేదు.  రకరకాల వేషాలు వేయడం చూపించాడు.  పాత జీవితాన్ని వదిలేశాక వచ్చే సన్నివేశాలలో ఉత్కంఠతను తీసుకురావడంలో దర్శకుడు విజయవంతం కాలేకపోయాడు.  కెమెరా పనితనం బాగుంది.  కొన్ని సన్నివేశాల్లో వచ్చే డైలాగులు ఆకట్టుకుంటాయి.  

పాజిటివ్ పాయింట్స్ : 

కథ 

సత్యదేవ్ నటన 

నందితా శ్వేతా 

మైనస్ పాయింట్స్ : 

స్క్రీన్ ప్లే 

చివరిగా : బ్లఫ్ మాస్టర్ - పర్వాలేదనిపించాడు.