గతంలో అక్కడే రెండుసార్లు జరిగింది..!!

గతంలో అక్కడే రెండుసార్లు జరిగింది..!!

గత కొన్ని రోజులుగా గోదావరికి వరద పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గోదావరికి రెండు సార్లు వరద ఉదృతి రావడంతో గోదావరిలో బోటు ప్రయాణాన్ని నిషేదించారు.  అయితే, వరద కొద్దిగా తగ్గుముఖం పట్టింది అని తెలియడంతో రాయల్ వశిష్ట అనే పర్యాటక బోటు 61 మందితో గండిపోచమ్మ దేవాలయం నుంచి పాపికొండలు వరకు బోటు బయలుదేరింది.  ఇందులో 50 మంది ప్రయాణికులు ఉండగా, 11 మంది సిబ్బంది ఉన్నారు.  

అయితే, దేవీపట్నం మండలం కచులూరు మందం వద్దకు చేరుకోవగానే బోటు ఒక్కసారిగా మునిగిపోయింది.  కాగా ఇందులోని 14 మంది ప్రయాణికులు లైఫ్ జాకెట్స్ ఉండటంతో బయటపడ్డారు. మిగతావారి కోసం ఎన్డీఆర్ బృందాలు గాలింపు చర్యలు మొదలుపెట్టాయి.  వరద ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు బోట్ ప్రయాణాన్ని ఎలా అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. 1964 లో ఉదయభాస్కర్ అనే బోటు అదే ప్రాంతంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 60 మంది ప్రయాణికులు మృతి చెందారు.  ఆ తరువాత ఝాన్సీరాణి బోట్ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఇప్పుడు జరిగిన ప్రమాదం కూడా అదే ప్రాంతంలో జరగడం శోచనీయం.