అస్థికలు కలుపుతూ నీటిలో పడిన బీజేపీ నేతలు

అస్థికలు కలుపుతూ నీటిలో పడిన బీజేపీ నేతలు

దివంగత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి అస్థికల నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ బస్తీ జిల్లాలో బీజేపీ నేతలు అస్థికలను నదిలో కలుపుతుండగా పడవ బోల్తా పడి పలువురు నేతలు నీటిలో పడిపోయారు. పడవలో సామర్ధ్యానికి మించి జనం ఎక్కడంతో ఒక్కసారిగా తిరగబడింది. దీంతో పలువురు బీజేపీ నేతలు నదిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఇతర నాయకులు నదిలోకి దూకి వారిని కాపాడారు. ఒడ్డు సమీపంలో పడవ బోల్తా పడిందని దీంతో పెను ప్రమాదం తప్పిందని జిల్లా కలెక్టర్ రాజశేఖర్ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ రమాపాటి రామ్ త్రిపాఠి, ఎంపీ హరీష్ ద్వివేది, ఎమ్మెల్యే రామ్ చౌదరి, సీనియర్ బీజేపీ నేతలు, ఎస్పీ దిలీప్‌కుమార్ తదితరులు ఉన్నారు.