ఆ పడవకు లైసెన్స్‌ లేదు

ఆ పడవకు లైసెన్స్‌ లేదు

గోదావరి నదిలో బోల్తా పడి ప్రమాదంకు గురైన పడవకు ఎలాంటి అనుమతులు లేవు అని భాదిత కుటుంబాలు ఆరోపణలు చేస్తున్నారు. పడవలకు అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛగా  వాటిని నడపడం వలెనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం లైఫ్‌జాకెట్లు కూడా లేకుండా రోజూ పడవలను నిర్వహిస్తున్నారు. మరోవైపు సామర్థ్యానికి మించి బరువుతో ప్రయాణం చేయడం వల్లే పడవ బోల్తా పడిందని అంటున్నారు. ఎన్ని పడవ ప్రమాదాలు జరిగినా పడవ నిర్వాహుకులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం పశువుల్లంకమొండి వద్ద శనివారం సాయంత్రం సుమారు 40 మందితో గోదావరి దాటుతున్న పడవ ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతికి అదుపు  తప్పి నిర్మాణంలో ఉన్న వంతెన స్తంభాన్ని ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. అందులో పాఠశాలల నుంచి తిరిగి వస్తున్న ఆరుగురు విద్యార్థినులు, ఓ మహిళ ఉన్నారు. మిగిలిన వారు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.