గోదావరిలో నాటు పడవ బోల్తా..

గోదావరిలో నాటు పడవ బోల్తా..

గోదావరి నదిలో నాటుపడవ బోల్తా పడింది. ఇవాళ మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల లంక వద్ద గోదావరి నదిలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 17 మందిని రక్షించారు. ప్రమాదం జరిగే సయమంలో పడవలో 20 మంది ఉన్నారని తెలుస్తోంది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. తలారివారిపాలెం లంక నుంచి పశువుల్లంక వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. స్థానికుల నుంచి సమాచారం అందడంతో అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు.  ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నదిలో గాలింపు కోసం రాజమండ్రి, విశాఖపట్నం నుంచి  రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను ప్రభుత్వం పంపించింది.