లంగర్లకు చిక్కిన బోటు...బయటకు తీసేందుకు యత్నం !

లంగర్లకు చిక్కిన బోటు...బయటకు తీసేందుకు యత్నం !

గోదావరిలో కచ్చులూరు వద్ద ముగినిపోయిన  రాయల్ వశిష్ట పున్నమి బోటు వెలికి తీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా బోటు మునిగిన చోట ఐదు లంగర్లు వేసింది సత్యం టీమ్. నీటి అడుగు భాగంలో రెండు లంగర్లు గట్టిగా పట్టుకున్నాయి. దీంతో అవి బోటుకే తగులుకుని ఉంటాయని భావిస్తున్నారు. లంగర్లకు కట్టిన ఐరన్‌ రోప్‌లను ప్రొక్లెయినర్‌తో లాగుతోంది సత్యం బృందం. ప్రస్తుతం కచ్చులూరు వద్ద వర్షం పడుతోంది. అయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా బోటును వెలికితీత పనులను కొనసాగిస్తోంది సత్యం బృందం. ప్రొక్లెయినర్‌ సహాయంతో ఈ బోటును నది గర్భం నుండి బయటకు తీసేందుకు సత్యం బృందం ప్రయత్నాలను ప్రారంభించింది.