నిషేధాజ్ఞలు అమల్లో ఉండగా గోదావరిలో మరో బోటు !

 నిషేధాజ్ఞలు అమల్లో ఉండగా గోదావరిలో మరో బోటు !

 కచ్చులూరు ప్రమాదం ఇంకా తెలుగు రాష్ట్రాల ప్రజలు మరువనేలేదు. అసలు బోటు ఎక్కడ ఉందో తెలీదు. గల్లంతైన వ్యక్తుల మృతదేహాలు ఇంకా మొత్తం గుర్తించనే లేదు. కానీ ప్రమాదం అని తెలిసినా మరో బోటు గోదావరిలో తిరిగింది. గోదావరిలో బోటు తిరగకుండా నిషేధాజ్ఞలు అమల్లో ఉండగా.. దేవీపట్నం తహసీల్దార్ కొడుకు.. స్నేహితుడితో కలిసి బోటులో షికారురకు వెళ్లాడు. బోటు డ్రైవర్ కూడా అడ్డుచెప్పకుండా నదిలో రౌండ్లు వేశాడు.

విషయం తెలుసుకున్న దేవీపట్నం పోలీసులు.. వెంటనే బోటును ఒడ్డుకు రప్పించారు. తహసీల్దార్ కొడుకు, అతడితో స్నేహితుడితో పాటు బోటు డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు బోటు ప్రమాద ఘటన మరిచిపోకముందే మరోవైపు తహసీల్దార్ కొడుకు బోటులో చక్కర్లు కొట్టడం అధికారుల్ని నివ్వెరపరిచింది. తహసీల్దార్ పై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. దేవీపట్నం తహసీల్దార్ తన బంధువుల కోసమే బోటుకు అనుమతించినట్లుగా తెలుస్తుండగా బోటులో ప్రయాణిస్తున్న వ్యక్తులు తహసీల్దార్ కొడుకేనని తేల్చారు.