ఓడిపోయిన అభ్యర్థి బైక్ యాత్ర..

ఓడిపోయిన అభ్యర్థి బైక్ యాత్ర..

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ ఆ వెంటనే తేరుకుని తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కృష్ణాజిల్లాలోని తన నియోజకవర్గం పెనమలూరులో బుల్లెట్‌పై తిరుగుతూ.. అందరినీ పలకిస్తూ.. ఓటు వేసిన వారికి ధన్యవాదాలు చెబుతూ... తన మీద కోపం ఉంటే క్షమించాలని విజ్ఞప్తి చేస్తూ గ్రామాల్లో ఇళ్లకు వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఓట్లు వేసిన వారికి థాంక్స్ అంటూ ఒంటరిగా గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై తిరుగుతున్నారు బోడె ప్రసాద్. తాను ఏ తప్పు చేయలేదు.. నాకు ఓటు వేసినందు థాంక్యూ  అమ్మ.. నా మీద ఏమైనా కోపం ఉంటే తీసేయండి.. నేనేమైనా తెలియక తప్పు చేస్తే క్షమించండంటూ ద్విచక్రవానంపై గ్రామాల్లో తిరుగుతూ ఓటర్లతో మాట్లాడుతున్నారు బోడె ప్రసాద్.