నదిలోకి దూసుకెళ్లిన బోయింగ్ విమానం..

నదిలోకి దూసుకెళ్లిన బోయింగ్ విమానం..

బోయింగ్ విమానం నదిలోకి దూసుకెళ్లిన ఘటన ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లేలో జరిగింది... క్యూబాలోని నావల్ స్టేషన్ గ్వాంటనామో బే నుంచి నావల్ ఎయిర్ స్టేషన్ జాక్సన్‌విల్లేకు వచ్చిన బోయింగ్ 737 విమానం.. శుక్రవారం  రాత్రి సమయంలో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా... స్కిడ్ కావడంతో రన్‌వే నుంచీ పక్కకు వెళ్లిపోయి.. జాన్స్ నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 136 మంది ప్రయాణికులుండగా... ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. బోయింగ్ విమానం నదిలోకి దూసుకెళ్లగానే వెంటనే స్పందించిన ఎయిర్ ‌పోర్ట్ అధికారులు... ప్రయాణికుల్ని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు. హుటాహుటిన నేవీ సెక్యూరిటీ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ పర్సన్స్ కూడా రంగంలోకి దిగింది... ప్రత్యేక బోట్లలో ప్రయాణికుల్ని ఒడ్డుకి చేర్చారు. అధికారులు వెంటనే స్పందించడంలో భారీ ప్రమాదం తప్పింది.