ప్రభాస్ తమ్ముడిగా బాలీవుడ్ యాక్షన్ హీరో..

ప్రభాస్ తమ్ముడిగా బాలీవుడ్ యాక్షన్ హీరో..

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు ప్రకటిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం వరకు కేవలం తెలుగు చిత్రసీమకే పరిమితం అయిన ప్రభాస్ జక్కన్నతో చేసిన బాహుబలితో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. దాంతో తన సినిమాలు పంథాను మార్చుకుని భారీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. బాహుబలి తరువాత సాహో సినిమా చేసిన ప్రభాస్ ఇటీవల తన నూతన చిత్రం రాధేశ్యామ్ చిత్రీకరణను ముగించుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌవుత్‌తో ఆదిపురుష్ చేస్తున్నాడు. దాంతో పాటుగా పాన్‌ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సలార్ సినిమాను కూడా తెరకెక్కించనున్నాడు. అయితే ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడని, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను పోషించనున్నాడు. అంతేకాకుండా సీత పాత్రలో కృతీసనన్ చేయనుందని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు లక్ష్మణుడి పాత్రలో ఎవరు చేయనున్నారన్నది మాత్రం ఫిక్స్ అవ్వలేదు. ఈ పాత్రకు అనేక మంది బాలీవుడ్ యంగ్‌స్టార్ల పేర్లు వినిపించాయి. వాటిలో అర్జున్ కపూర్ పేరు కూడా వచ్చింది. తాజాగా ఈ జాబితాలోకి మరో పేరు చేరింది. బాలీవుడ్ యాక్షన్‌ హీరోగా పేరుతెచ్చుకున్న టైగర్ ష్రాఫ్ కూడా ఈ రేసులో ఉన్నాడట. ఈ వార్త బీటౌన్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై క్లారిటీ ఇంకా రాలేదు. ఆదిపురుష్ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో ఎవరు చేయనున్నారని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.